తీవ్రవాదం ఉద్దేశ్యం యుద్ధం కాదు, భయంతో సమాజాన్ని నిర్వీర్యం చేయడమే. దాని లక్ష్యం భయాందోళనలు వ్యాపింపజేయడం, సమాజాన్ని విభజించడం, ప్రతి స్థాయిలో దేశ ఆర్థిక వృద్ధిని దెబ్బతీయడం, అరాచకాన్ని సృష్టించడం. ఈ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలన్నా, పోషించుకోవాలన్నా, ఇలాంటి శక్తులను ఉక్కుపాదంతో, దృఢమైన దీర్ఘకాలిక సంకల్పంతో అణచివేయాలి. దీనికి విస్తృతమైన, దీర్ఘకాలిక పరిష్కారాలున్నాయి – విద్య, ఆర్థిక అవకాశాలు, సంపద, సంక్షేమం అన్ని స్థాయిలలో మరింత సమానంగా పంపిణీ జరగడం వంటివి. ప్రస్తుతానికి, మతం, కులం, వర్గం లేదా రాజకీయ అనుబంధాలు వంటి అన్ని సంకుచిత విభేదాలకు అతీతంగా ఒక దేశంగా కలిసి నిలబడటం, మన భద్రతా బలగాలు అన్ని స్థాయిలలో వారి విధులను నిర్వర్తించడానికి మద్దతు ఇవ్వడం అత్యంత ముఖ్యం. మృతుల కుటుంబ సభ్యులకు, గాయపడిన వారందరికీ మా ప్రగాఢ సానుభూతి & ఆశీస్సులు. -సద్గురు
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
Learn more about your ad choices. Visit megaphone.fm/adchoices