1. EachPod
EachPod

'సత్యలింగం' - పతంజలి శాస్త్రి గారి రచన (గుప్తా'91 సంపుటం నించి)

Author
Mohan
Published
Sun 22 Dec 2024
Episode Link
https://chaaya-books.captivate.fm

సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా  సత్యలింగం అత్యుత్తమైన కథ.    

కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే  కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని, నాయుడి  మనసులో సత్యలింగాన్ని ప్రతిష్టిస్తాడు కాంతారావు.  సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏవి జరిగింది, అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మధనం , కూర్మయ్య నాయుడి పై అతనికి తెలీకుండా ఏర్పడే సానుభూతి, కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి. 

కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత మనిషి కి ఇచ్చే ఆసరా,  వీటన్నిటీ గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపచేస్తుంది ‘సత్యలింగం’.  

గుప్తా'91 పుస్తకం కొనడానికి -

http://bit.ly/3lGsrqd

Share to: